నల్లగొండ : ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 64, ఇతర శాఖలకు 51 మొత్తం 115 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ మండల స్థాయి వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వచ్చే మూడు రోజులపాటు వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులు అన్ని గ్రామాల్లో వాన నీటిని సంరక్షించాలని, సోక్ పిట్లు, కాలువలు, చెరువుల్లో, భూమిపై పడిన ప్రతివర్షపు చుక్క సద్వినియోగం అయ్యేలా, భూమిలోకి ఇంకేలా చూడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా నీటి నిలువ కట్టడాలు ఉండాలన్నారు. హాస్టళ్లలో కూడా నీటి నిల్వ కట్టడాలను, ఇంకుడు గుంతలను నిర్మించాలని చెప్పారు. ఈ వారంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోక్ పిట్ల నిర్మాణం పూర్తికావాలన్నారు. ఎల్‌నినో దృష్ట్యా రైతులు రబీలో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


