బుద్ధవనాన్ని సందర్శించండి | - | Sakshi
Sakshi News home page

బుద్ధవనాన్ని సందర్శించండి

Aug 30 2026 5:07 AM | Updated on Aug 30 2026 5:07 AM

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించాలని అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలోని బౌద్ధాచార్యులను బౌద్ధ పరిశోధకుడు, బుద్ధవనం నిర్మాణ సలహాదారుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి కోరారు. స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్‌రెడ్డి లట్టుపల్లి సహకారంతో శనివారం ఫిలడెల్ఫియా నగరంలోని బౌద్ధ విహారాలు, ఆలయాలను సందర్శించి అక్కడి బౌద్ధాచార్యులతో సమావేశమయ్యారు. నాగార్జునకొండ, బుద్ధవనం ప్రత్యేకతలతో పాటు తెలంగాణలోని బౌద్ధారామాలు, బౌద్ధ వారసత్వ ప్రదేశాల విశిష్టతలను వారికి వివరించినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు బుద్ధవనాన్ని సందర్శిస్తామని ఫిలడెల్ఫియా బౌద్ధాచార్యలు చెప్పినట్టు శివనాగిరెడ్డి పేర్కొన్నారు.

ఫిలడెల్ఫియా బౌద్ధాచార్యులకు

ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement