అక్టోబర్‌ నాటికి భూ సర్వే పూర్తి | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ నాటికి భూ సర్వే పూర్తి

Aug 30 2026 5:07 AM | Updated on Aug 30 2026 5:07 AM

ప్రజాప్రతినిధులు

ఎవరేమన్నారంటే..

డిసెంబర్‌లో రెండో విడతకు

సిద్ధం కావాలి

దసరాలోపు తొలి విడత

ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయించాలి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం

హాజరైన మంత్రి కోమటిరెడ్డి,

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,

అధికారులు

సూర్యాపేట : రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత చేపట్టిన భూముల రీ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చి అక్టోబర్‌ చివరి నాటికి పూర్తిచేయాలని, డిసెంబర్‌లో రెండో విడత సర్వే చేపట్టేందుకు సంసిద్ధం కావాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సర్వే, గృహ నిర్మాణ శాఖల సమీక్ష సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. మొదటి విడత 70 గ్రామాల్లో సర్వేను పారదర్శకంగా నిర్వహించి గ్రామ సరిహద్దులు నిర్ధారించడంపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యక్షంగా వీటిని పర్యవేక్షించాలన్నారు. రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన సమస్యలను చట్టానికి లోబడి పరిష్కరించాలన్నారు. భూములకు సంబంధించి 45 దరఖాస్తులు తన లాగిన్‌లోనే ఎక్కువ రోజులు ఉంచుకోవడంపై యాదాద్రి జిల్లా అడ్డగూడూరు తహసీల్దార్‌ను వివరణ కోరాలని మంత్రి ఆదేశించారు.

దసరాలోపు ఇళ్లు పూర్తిచేయించాలి

ఇందిరమ్మ మొదటి విడతలో అసంపూర్తిగా ఉన్న ఉన్న ఇళ్లను దసరాలోపు పూర్తిచేయించాలని, నల్లగొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్‌ కింద 500 గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను గుర్తించి 15 రోజుల్లో పూర్తిచేయాలన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లడ్ల మంజూరులో మిగిలిపోయిన, అలాగే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను దసరాలోపే లబ్ధిదారులకు ఇచ్చేలా చూడాలన్నారు. ఎల్‌–1, ఎల్‌–2, ఎల్‌–3 సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే రెవెన్యూ సీసీఎల్‌ఏ సెక్రటరీ లోకేష్‌ కుమార్‌, ల్యాండ్‌ సర్వే సెటిల్మెంట్‌ కమిషనర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్‌ వారి శాఖలకు సంబంధించిన అంశాలను వివరించారు. నల్లగొండ కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వారి జిల్లాలకు సంబంధించిన పలు విషయాలను మంత్రులకు వివరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో సూర్యాపేటకు మంజూరైన తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల భవన నిర్మాణాలకు మంత్రులు శంకుస్ధాపన చేశారు.

ఫ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భూభారతి ద్వారా పేదవారి భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఫ ప్రభుత్వ విప్‌లు, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన ఎల్‌–3 మస్యలు పరిష్కరించాలన్నారు.

ఫ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ మాట్లాడుతూ శాలిగౌరారం మండలం మాదారం చెరువు శిఖం భూమి ఆక్రమణ, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మిర్యాలగూడ, నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్‌, నెల్లికంటి సత్యం, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్‌ రిజిస్టర్లు, సర్వే ల్యాండ్‌ రికార్‌ుడ్స ఏడీలు, తహసీల్దార్లు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement