ముందుకెళ్లేదెలా? | - | Sakshi
Sakshi News home page

ముందుకెళ్లేదెలా?

Aug 30 2026 5:07 AM | Updated on Aug 30 2026 5:07 AM

పెరిగిన రాజకీయ ఒత్తిళ్లు

సమాధానం రాకపోతే చర్యలే..

ఐకాన్‌

ఆస్పత్రిపై

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్రంలోని ఐకాన్‌ ఆసుపత్రి వ్యవహారం వైద్యారోగ్య శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఆసుపత్రి నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు, రోగుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు, ఇతర అనుమతులకు సంబంధించిన లోపాలు ఉన్నట్లు అధికారుల విచారణలో గుర్తించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టాలలో తేల్చుకోలేకపోతున్నారు. ఆసుపత్రి ప్రారంభించిన మూడేళ్లలోనే 191 మంది రోగులు మరణించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా వస్తుండటంతో ఆస్పత్రిపై చర్యలు తీసుకునే విషయమై అధికారులు ముందుకు వెళ్లలేకపోతున్నట్లు తెలుస్తోంది. అధిక ఫీజులు వసూలు చేశారని, నిబంధనలకు విరుద్దంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులతో 19 రోజుల క్రితం ఐకాన్‌ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.రాహుల్‌, ఇతర అధికారులు తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుంచి ఈ మూడేళ్లలో మరణించిన వారి కేస్‌ షీట్లతో పాటు ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని లోపాలపై యాజమాన్యం నుంచి వివరణ తీసుకున్న తర్వాతే తుది చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

మూడు రోజులు ఇచ్చినా,

మరో 15 రోజులు గడువు..

ఆసుపత్రి నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. సిబ్బంది, వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, రోగులకు అందించే సేవలు, వసూళ్లు తదితర 42 రకాల లోపాలు, తప్పిదాలు, అంశాలకు సంబంధించిన వివరణ, కేస్‌ షీట్లు వంటి డాక్యుమెంట్లు మూడు రోజుల్లో ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం వాటికి నిర్దేశిత సమయంలో సమాధానం ఇవ్వలేదు. అవన్నీ ఇచ్చేందుకు మరో 15 రోజులు గడువు కావాలని కోరింది. అందుకు అధికారులు అంగీకరించారు. ఆ 15 రోజుల గడువు కూడా శనివారంతో ముగిసింది. అయినా యాజమాన్యం నుంచి సమాధానం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఫ ఇప్పటికే లోపాలను, అక్రమాలను గుర్తించిన జిల్లా వైద్యశాఖ

ఫ ఆసుపత్రిపై చర్యలు

తీసుకోకుండా రాజకీయ ఒత్తిళ్లు!

ఫ వైద్యశాఖ అధికారుల తర్జనభర్జన

ఫ లోపాలపై సమాధానం కోసం

రెండుసార్లు గడువు

ఫ అయినా వివరణ ఇవ్వని

ఆసుపత్రి యాజమాన్యం

ఫ నేడు మూడోసారి

నోటీసులు ఇవ్వాలని నిర్ణయం

ఐకాన్‌ ఆసుపత్రిపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని అధికార పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నపాటి చర్యలు తప్ప పెద్దగా చర్యలు తీసుకోవద్దని ఆయా పార్టీల నాయకులు హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో ఐకాన్‌ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై వైద్యారోగ్య శాఖ తర్జనభర్జన పడుతోంది.

రెండుసార్లు అవకాశం ఇచ్చినా సమాధానం, వివరణలు ఇవ్వని పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై వైద్యారోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌తో సమావేశమైనట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. మూడోసారి కూడా గతంలో అడిగిన అంశాలపైనే వివరణ కోరుతూ ఈ నెల 30న నోటీసులు జారీచేసేందుకు సిద్ధమయ్యారు. మూడో దఫా కూడా వారం రోజులు సమయం ఇవ్వనున్నారు. అయినప్పటికీ వివరణలు, సమాధానాలు, కేస్‌ షీట్లు వంటి రికార్డులను ఇవ్వకపోతే సీరియస్‌గానే వ్యవహరించాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలిసింది. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గొద్దని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో బాధ్యుల విషయలో కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement