నల్లగొండ : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులకు ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశంలో వివిధ వైద్య విభాగాల పనితీరు, అవసరమైన పరికరాలపై సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సర్జికల్ పరికరాలు అందుబాటులో ఉంచాలని, రోడ్డు ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి జిల్లాస్థాయిలోనే కృత్రిమ అవయవాలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పోషకాహారంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు పిల్లలకు ప్రత్యేక ఎక్స్‌రే సదుపాయం, రోగుల వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మేయర్ బుర్రి చైతన్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
ఫకలెక్టర్ చంద్రశేఖర్


