కలెక్టరేట్‌ ఎదుట ‘తపస్‌’ ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట ‘తపస్‌’ ధర్నా

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

నల్లగొండ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని తపస్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్‌గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల రాజశేఖర్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ నివేదికను స్వీకరించి 51 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే అందించాలని కోరారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపకపోతే ఆగస్టు 1న రాష్ట్రవ్యాప్తంగా మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఇరుగు శ్రీరామ్‌, విజయ్‌కుమార్‌, భాస్కర్‌రెడ్డి, భిక్షపతి, గణేష్‌, రామకృష్ణారెడ్డి, నూనెముంతల లక్ష్మీనారాయణ, దండేపల్లి లక్ష్మీనారాయణ, కొన్నె శంకర్‌గౌడ్‌, వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement