నల్లగొండ : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన కార్యవర్గాన్ని 64 మందితో ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆమోదించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత సమర్పించిన ప్రతిపాదనల మేరకు 64 మందితో కూడిన కార్యవర్గాన్ని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పున్న కై లాస్ నేత జాబితాను విడుదల చేశారు. నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం..
కొత్త కార్యవర్గంలో 10 మంది ఉపాధ్యక్షులు, 24 మంది ప్రధాన కార్యదర్శులు, ముగ్గురు అధి కార ప్రతినిధులు (స్పోక్స్‌పర్సన్స్), 27 మంది కార్యదర్శులను నియమించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా కార్యవర్గాన్ని రూపొందించినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ అప్పగించిన ఈ బాధ్యతలను అంకితభావంతో, నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని కై లాష్‌నేత పేర్కొన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటు ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.


