ఫ శ్రీస్వామి వారి అనుగ్రహంతో యాదగిరీశుడి పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దడంతో పాటు సాధారణ భక్తులు, పీఠాధిపతులు, మఠాలు, ధార్మిక సంస్థలు, దాతలు, ప్రవాస భారతీయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం.
ఫ శ్రీనృసింహుడి క్షేత్రంలో ఉత్సవాలను పాంచరాత్ర ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా, అత్యంత ప్రవిత్రత, శాస్త్ర బద్ధత, వైభవంతో నిర్విహిస్తామని, దివ్య బాధ్యత నిర్వహించడంతో తామంతా అంకితభావం, దృఢ సంకల్పం, భగవద్భక్తి అనే నాలుగు స్తంభాలను సేవ ప్రస్థానానికి మూలధారాలుగా స్వీకరిస్తాం.
ఫ సామాన్య భక్తుల ప్రయోజనాలకు భంగం కలుగనివ్వని, విశిష్ట అతిథుల ప్రతిష్టకు ఎలాంటి లోటూ రాకుండా సక్రమమైన విధి విధానాలు, సమయ నియంత్రణ, ప్రత్యేక ప్రణాళికలు, సాంక్షేతిక పరిష్కార మార్గాల ద్వారా సామాన్య భక్తుల ప్రాధాన్యత, విశిష్ట అతిధుల గౌరవం అనే రెండు ధర్మాలను సమతుల్యంగా సమన్వయ పరుస్తామని, దర్శన వ్యవస్థను యాదగిరిగుట్టలో నెలకొల్పుతాం.


