ఉమ్మడి జిల్లాలో రూ.553.42 కోట్ల విలువైన ధాన్యం మింగిన మిల్లర్లు
నల్లమలలోకి రేకులవలయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మిల్లర్లకు ఇచ్చిన ధాన్యానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రాబట్టుకోవాల్సిన పౌర సరఫరాల విభాగంలోని కొందరు అధికారులు అడ్డగోలు తీరుతో ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లింది. మిల్లర్లు ఒక్క నల్లగొండ జిల్లాలోనే 248.61 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించగా, సూర్యాపేట జిల్లాలో రూ.252 కోట్ల విలువైన ధాన్యాన్ని, యాదాద్రి జిల్లాలో రూ.52.80 కోట్ల విలువైన ధాన్యాన్ని దిగమింగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.553.42 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. ఇదంతా ఒక్క 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించిందే కావడం గమనార్హం. మిల్లర్లతో కుమ్మక్కు అయి అమ్యామ్యాలకు అలవాటుపడిన కొందరు అధికారులు వాటి రికవరీ చేయడంలో అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
గత్యంతరం లేక వేలం వేసిన ప్రభుత్వం
రైతులనుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్ కోసం కేటాయించింది. మిల్లర్లు మరాడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఏ సీజన్‌లో ధాన్యం కేటాయిస్తే గరిష్టంగా మూడు నెలల్లోగా బియ్యంగా మార్చి మిల్లర్లు ఇవ్వాలి. 2022–23 యాసంగిలో కేటాయించిన ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ఉమ్మడి జిల్లాలోని దాదాపు 200 మిల్లుల నుంచి 2,47,416.47 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యం ఇవ్వలేదు. అయినా అప్పట్లో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం మిల్లులోని ఆ ధాన్యాన్ని 2024లో వేలం వేసింది. దాంతో వేలం దక్కించుకున్న వారికి మిల్లర్లు అప్పగించింది కేవలం 9 శాతం లోపే. మిగతా ధాన్యం ఎందుకు ఇవ్వడం లేదన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకొని మిల్లుల్లో తనిఖీలు చేయించింది. మిగిలిన ఆ ధాన్యం చాలా మిల్లుల్లో లేదని తనిఖీ బృందాలు గుర్తించాయి. మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు తేల్చాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించడంతో ప్రభుత్వం రికవరీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఏడు మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది.
రికవరీ చేసింది అంతంతే..
ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అంతేకాదు రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్‌ఆర్ యాక్ట్) అమలుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొందరు మిల్లర్లు ధాన్యానికి బదులుగా డబ్బు చెల్లిస్తామని ముందుకొచ్చారు. మిల్లర్ల తరఫున కొందరు రాజకీయ నేతలు రంగంలోకి దిగడంతో వివాదం లేకుండా ధాన్యం రికవరీ కోసం ప్రభుత్వం రెండు నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఆ సబ్ కమిటీ ఇటు మిల్లర్లు, పౌరసరఫరాల సంస్థ, ధాన్యం కొనుగోలు చేసేందుకు వేలంలో పాల్గొన్న సంస్థలతో చర్చించింది. మూడు నెలల్లో ధాన్యానికి సంబంధించి అంతే విలువైన డబ్బు చెల్లించాలని మిల్లర్లకు సూచించింది. ఇది జరిగి రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు 5 శాతం కూడా చెల్లించలేదు. మొత్తంగా రూ.553.42 కోట్లు రావాల్సి ఉండగా.. మిల్లర్లలో కొందరు మాత్రమే రూ.15 కోట్లలోపే చెల్లించారు. ఇప్పుడు మిల్లర్లు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారని, ధాన్యం డబ్బులు చెల్లించాల్సిన గడువు ఆగస్టు 5వ తేదీతో ముగుస్తుందని, ఆలోగా చెల్లించాలని అధికారులు పేర్కొంటున్నారు.
ఫ పునరాసంపై అవగాహన కల్పించిన అటవీ శాఖ అధికారులు
జిల్లా వారీగా రికవరీ ఇలా..
నల్లగొండ జిల్లాలో 58 మిల్లుల నుంచి 1,11,146.43 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.248.61 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.9 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా రూ.239.61 కోట్లు రికవరీ కావాల్సి ఉంది.
సూర్యాపేట జిల్లాలో దాదాపు 70 మిల్లుల నుంచి 1,12,661.26 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.252 కోట్లు రావాల్సి ఉండగా, ఏమీ రాలేదని పౌరసరఫరాల విభాగం వర్గాలు పేర్కొన్నాయి.
యాదాద్రి జిల్లాలో దాదాపు 40 మిల్లుల నుంచి 23,608.78 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.52.80 కోట్లు రావాల్సి ఉండగా, రూ.2 కోట్లు మాత్రమే వచ్చిందని, ఇంకా రూ.50 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు.
ఫ 2022–23 యాసంగి సీజన్ ధాన్యం తీసుకుని సీఎంఆర్ ఇవ్వని పలు మిల్లులు
ఫ రెండేళ్ల క్రితం ఆయా మిల్లర్లపై కేసు నమోదు
ఫ 90 రోజుల్లో రికవరీ చేయాలని కేబినెట్ సబ్‌కమిటీ ఆదేశం
ఫ రెండు నెలల్లో చెల్లించింది రూ.15 కోట్లలోపే..
ఫ అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు


