నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాధితుల వద్ద నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజావానిలో రెవెన్యూ శాఖకు 56, ఇతర శాఖలకు 40 మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ (టైనీ) శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్‌కుమార్, డీఆర్‌ఓ దశరథ పాల్గొన్నారు.
99.2 శాతం ఫారాలు పంపిణీ చేశాం
నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 99.2 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి పాల్గొని మాట్లాడారు. సర్‌కు సంబంధించి డిజిటైజేషన్ 25 శాతం పూర్తి చేశామని తెలిపారు. బీఎల్‌ఓలు చురుకుగా లేనిచోట గుర్తించి సంబంధిత మండలాల జూనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ దశరథ తదితరులు పాల్గొన్నారు.


