హైవేపై మృత్యు వేగం! | - | Sakshi
Sakshi News home page

హైవేపై మృత్యు వేగం!

Jul 6 2026 2:10 AM | Updated on Jul 6 2026 2:10 AM

మితిమీరిన వేగం.. నిద్రమత్తు..

జాతీయ రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. నిబంధనలను బేఖాతరు చేస్తూ వాహనాలు నడుపుతుండటంతోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. హైవేపై బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాలు, మూల మలుపుల వద్ద నిబంధనల మేరకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలి. కానీ, చాలా వాహనాలు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోతున్నాయి. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము సమయాల్లో డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటం, దానికి తోడు అతివేగం తోడవడంతోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌లతో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులే కారణమవుతున్నాయి. ఇవి నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా దూసుకొస్తూ.. ముందు వెళ్తున్న వాహనాలను వెనుక నుంచి ఢీకొడుతుండటం వల్లే వరుస దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

చిట్యాల : 65వ నంబర్‌ జాతీయ రహదారిపై మితిమీరిన వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రాణాలను బలితీసుకుంటోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. ముఖ్యంగా అర్ధరాత్రి దాటాక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు సృష్టిస్తున్న బీభత్సంతో జాతీయ రహదారి నెత్తురోడుతోంది. వారం రోజుల వ్యవధిలోనే మూడు ఘోర ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన దుర్ఘటన అందరినీ కలచివేసింది. కూతురి వైద్య చికిత్స కోసం చైన్నె వెళ్లి ఇంటికి తిరుగు పయనమైన ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారును.. ఓ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కళ్లెదుటే భార్య, ఇద్దరు పిల్లలతో పాటు స్నేహితుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుటుంబ పెద్ద ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గమ్యానికి మరో గంటలో చేరుకుంటారనగా ఈ విషాదం చోటుచేసుకుంది.

ఫ హైదరాబాద్‌లోని మధురానగర్‌లో నివాసముంటున్న మలిరెడ్డి వీర వెంకట నాగ వరప్రసాద్‌బాబు తన కూతురు వైద్యం కోసం భార్య విజయలక్ష్మి, కుమార్తె శ్రియ, కుమారుడు ప్రభవ్‌, స్నేహితుడు కట్టా శ్రీకర్‌ ప్రసాద్‌ (62)తో కలిసి చైన్నెకి వెళ్లారు. శనివారం రాత్రి చైన్నె నుంచి కారులో హైదరాాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్‌ హైవేపై గల యూటర్న్‌ వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి అతివేగంగా వస్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వారి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు చుట్టూ తిరుగుతూ డివైడర్‌ను ఢీకొట్టి నుజ్జునుజ్జుగా మారింది. దీంతో జేసీబీలు, కట్టర్‌ల సహాయంలో కారు టాప్‌ను కత్తిరించి విజయలక్ష్మి, శ్రియ, ప్రభవ్‌, శ్రీకర్‌ప్రసాద్‌ మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంతో దాదాపు గంటపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

ఫ జూన్‌ 30న చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ వాహనం అతివేగంగా దూసుకొచ్చి ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆ వాహనం డివైడర్‌ను దాటి అవతలి వైపు వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ఘటనలో నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఫ ఈనెల 2న కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం శివారులో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఆ బస్సు ముందు వెళుతున్న సిమెంట్‌ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

పెద్ద చెరువు

విజయవాడ

హైదరాబాద్‌

గాంధీగుడి

ప్రమాదం జరిగిన స్థలం

ఫ పెద్దకాపర్తి శివారులో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాద ఊహా చిత్రం

ఫ 65వ నంబర్‌ జాతీయ రహదారిపై

వరుస ప్రమాదాలు

ఫ ట్రావెల్స్‌ బస్సుల అతివేగం,

నిర్లక్ష్యంతోనే అనర్థాలు

ఫ వారం వ్యవధిలో

మూడు ఘటనలు..

ఫ తాజాగా పెద్దకాపర్తి శివారులో కారును ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

ఫ ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు సహా నలుగురి దుర్మరణం

ఫ కూతురి వైద్యం కోసం వెళ్లి

వస్తుండగా కాటేసిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement