యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, శివాలయం, క్యూకాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడాయి. స్వామివారిని 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజల ద్వారా రూ.54,30,877 నిత్యాదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


