హక్కుల సాధనకు పోరాటమే ఆయుధం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు పోరాటమే ఆయుధం

Jul 6 2026 2:04 AM | Updated on Jul 6 2026 2:04 AM

నల్లగొండ టౌన్‌: సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న యువ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ రక్షణ హక్కులు దక్కాలంటే సంఘటిత పోరాటమే ఆయుధమని తెలంగాణ యంగ్‌ వర్కర్స్‌ కన్వీనర్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌ అన్నారు. నల్లగొండలో ఆదివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాల కారణంగా యువ కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అసంఘటిత రంగ యువతలో అత్యధిక మందికి కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అందడం లేదన్నారు. జిల్లా స్టీరింగ్‌ కన్వీనింగ్‌ కమిటీ 15 మందితో ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా చిన్నపాక లక్ష్మీనారాయణ, కోకన్వీనర్లుగా ఎం రవినా యక్‌, భీమగాని గణేష్‌, మరో 12మంది సభ్యులను ప్రకటించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పోలె సత్యనారాయణ, భీమగాని గణేష్‌, బండారి మధు, గంజి రాజేష్‌, ఏర్పుల శ్రావణ్‌, జి.కొండల్‌, టి.రాజు, పోగల శశిధర్‌, ఎ.నరేష్‌ భాగ్యరాణి పాల్గొన్నారు.

ఫ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి

పుప్పాల శ్రీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement