మర్రిగూడ : ప్రజా పోరాటాలతోనే నిరుపేదల సమస్యల పరిష్కారంతోపాటు హక్కుల రక్షణ కల్పించబడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం మర్రిగూడ మండలం ఖుదాబక్షపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు నాయకులు చేసిన త్యాగాలు, వీరోచిత పోరాటాల ఫలితంగానే నేడు సమాజంలో సామాన్య ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో జీవిస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తూ పేదల పొట్టగొడుతోందన్నారు. ఉపాది హామీ పథకం పేరు మార్చి శ్రామికుల హక్కులను కాలరాసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా, మండల నాయకులు ఈదుల భిక్షంరెడ్డి, బుర్ర శేఖర్, బూడిద సురేష్, మేతరి యాదయ్య, ఇస్కిళ్ల మహేందర్, సత్యం, లక్ష్మయ్య, విరజాల మహేందర్, గిరి, అశోక్, ఈశ్వర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


