భువనగిరి జిల్లా రామన్నపేట మా సొంతూరు. మా నాన్న అడ్వకేట్‌గా పనిచేస్తున్నాడు. నేను వ్యవసాయ రంగంపై ఇష్టంతోనే అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాను. 2017లో ఏఈఓ ఉద్యోగానికి ఎంపియ్యాను. విధుల్లో చేరిననాటి నుంచి ‘పొలమే నా ఆఫీస్’గా పనిచేస్తున్నాను. రైతులకు అవసరమైన కొత్త టెక్నాలజీని, ప్రభుత్వ పథకాలను అందించి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి చేస్తున్నాను. నా క్లస్టర్ పరిధిలో ఒక్క ఎకరం భూమి కూడా బీడుగా లేకుండా రైతులకు అవగాహన కల్పించి పంటలు వేసేందుకు సూచనలు ఇస్తున్నాను. ఇటీవల గ్రామాల్లో ఎఫ్‌పీఓలను తయారు చేసి రైతులు తమ పండించిన పంటలను నేరుగా అమ్ముకునేలా, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకునేలా గైడ్ చేస్తున్నాను. – ఉయ్యాల శశాంక, ఏఈఓ, తాళ్లవెల్లెంల, చిట్యాల మండలం


