ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ దున్నపోతులగండి, నెల్లికల్లు ఎత్తిపోతల పనుల పరిశీలన
మిర్యాలగూడ : ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యానికి ఇన్సెంటివ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వాతావరణంలో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను సాగు చేయాలన్నారు. శనివారం ఆయన జిల్లాలో నిర్మాణంలో ఉన్న దున్నపోతులగండి, నెల్లికల్లు ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. ముందుగా మిర్యాలగూడ చేరుకున్న ఆయన ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. వచ్చే రెండున్నరేళ్లలో పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైస్ మిల్లులు నిర్మించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైలో గోదాములను మహిళలే నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌నేత, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఆలిండియా రైస్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశం, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, మిల్లర్లు కర్నాటి రమేష్, గౌరు శ్రీనివాస్, బండారు కుశలయ్య గుండా మల్లయ్య, చకిలం రామయ్య, చిన్నపరెడ్డి పాల్గొన్నారు.
డిసెంబర్ నాటికి దున్నపోతుల గండి పూర్తి..
అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి.. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ మల్లారెడ్డి, సీఈ గంధం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ మోసిన్‌బిన్‌అహ్మద్, తహసీల్దార్ రాగ్యానాయక్, సీఐ పీఎన్‌డీ.ప్రసాద్, ఎస్‌ఐ శేఖర్, కాంట్రాక్టర్ సుమన్‌రావు, డీఈలు కేశవ్, స్వప్న, జేఈ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


