అధికారిగా ఆమె రైతుకు చేదోడు | - | Sakshi
Sakshi News home page

అధికారిగా ఆమె రైతుకు చేదోడు

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

అంకిత భావంతో పనిచేస్తున్నా.. మానాన్న బాటలో నడవాలని..

వ్యవసాయ రంగంలో రాణిస్తున్న మహిళా ఏఓలు, ఏఈఓలు

పంటల దిగుబడి పెంచేలా రైతులకు దిశానిర్దేశం

మా స్వస్థలం సూర్యాపేట పట్టణం. మా తల్లితండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. నాకు డాక్టర్‌ కావాలనే ఆలోచన ఉన్నా.. డాక్టర్‌ కంటే రైతులకు సేవ చేస్తే బాగుటుందని మా అమ్మానాన్న చెప్పేవారు. ఈ క్రమంలో నేను 2002లో ఎంఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేశాను. ఆ సమయంలోనే నాకు బీఎస్సీ అగ్రికల్చర్‌లో అధిక మార్కులు ఉండటంతో ఎలాంటి పోటీ పరీక్ష లేకుండా నాకు ఏఈఓ ఉద్యోగం ఇచ్చింది. కానీ నేను అప్పుడు చేరకుండా పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత 2009లో ఉద్యోగంలో చేరాను. ఏఈఓగా ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే నాకు ఏఓగా పదోన్నతి లభించింది. విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ రైతులకు తగిన సలహాలు, సూచనలు చేస్తున్నాను.

– ఎస్‌.పద్మజ, ఏఓ, మునుగోడు

మా నాన్న అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. నిత్యం రైతులు మా ఇంటికి వచ్చి పంట పొలాల విషయంపై చర్చించేవారు. నేను కూడా మానాన్న బాటలోనే నడిస్తూ అగ్రికల్చర్‌ అధికారి కావాలన్న లక్ష్యంతో నేను కూడా అగ్రికల్చర్‌ బీఎస్సీ చేశా. రైతులకు సాగులో మెళకువలు, ఆధునిక పద్ధతులు, సేంద్రియ విధానాలపై అవగాహన కల్పిస్తున్నా. రైతుకు మేలు జరిగే ఏ విషయాన్ని కూడా తాత్సార్యం చేయకుండా రైతులకు తెలియజేస్తున్నా. మహిళ రైతులను సైతం ఈ రంగం వైపు మళ్లించేందుకు నావంతుగా కృషి చేస్తున్నా.

– మేకల రుషేంద్రమణి, ఏఓ, మిర్యాలగూడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement