ఓటర్లకు బీఎల్‌ఓల సాయం | - | Sakshi
Sakshi News home page

ఓటర్లకు బీఎల్‌ఓల సాయం

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

నకిరేకల్‌ : ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) కార్యమంలో భాగంగా ఫారాలు పూరించడంలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తీర్చేందుకు నకిరేకల్‌లో బీఎల్‌ఓలు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ‘సర్‌కు సవాళ్లు’ శీర్షికన శనివారం శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికార యంత్రంగా స్పందించింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నకిరేకల్‌ తహసీల్దార్‌ యశ్వంత్‌రాజ్‌ పలు ప్రాంతాలను సందర్శించారు. సాక్షి కథనంలో ప్రస్తావించిన వృద్ధుడు పుట్ట యల్లయ్య నివాసానికి చేరుకుని స్వయంగా అతని ఫారాన్ని నింపడంలో సహయం చేసి.. పూర్తి చేసిన ఫారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ(సర్‌) ప్రక్రియలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఎల్‌ఓలు సాయం అందిస్తారని తెలిపారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలిసి వారి సమక్షంలోనే ఫారాల్లో అవసరమైన వివరాలను నమోదు చేయించి సంతకాలు తీసుకుని స్వీకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లు ఇబ్బందులపై కథనం ప్రచురించిన ‘సాక్షి’ దినపత్రికకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట సూపర్‌వైజర్లు మోదిన్‌పాష, గీతా, బీఎల్‌ఓలు నాగమణి, సుజాత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement