మొదటి దశలో 8వేల ఎకరాలకు నీరిస్తాం | - | Sakshi
Sakshi News home page

మొదటి దశలో 8వేల ఎకరాలకు నీరిస్తాం

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

తిరుమలగిరి(సాగర్‌) : డిసెంబర్‌ నాటికి నెల్లికల్లు లిఫ్టు మొదటి విడత పనులు పూర్తిచేసి 8 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని నెల్లికల్లు లిఫ్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లులు వెంటటనే చెల్లించి సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వచ్చే వేసవి నాటికి రెండో విడత పనులను పూర్తి చేసి 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాగితాలకు, శంకుస్థాపనలకే పరిమితమైందని, నేడు ఆ పనులు తాము చేపడుతున్నామని చెప్పారు. ఎన్‌ఎస్పీ మెయిన్‌ కెనాల్‌కు గండిపడే ప్రమాదం ఉంటే రూ.55 కోట్లతో పనులు చేపట్టామన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ప్రాంతం నుంచే తాను ఆరు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యానని.. ఈ ప్రాంతంపై తనకు బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్‌, ఎస్‌ఈ మల్లికార్జునరావు, జీఎం శ్రీనాథ్‌రెడ్డి, డిప్యూటీ ఎస్‌ఈ భద్రు, ఈఈ సత్యనారాయణ, డీఈ శ్రవణ్‌కుమార్‌, ఆర్డీఓ రమణారెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి, హాలియా మున్సిపల్‌ చైర్మన్‌ చింతల చంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కాంసాని చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు లాలునాయక్‌, గడ్డం సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement