రైతుకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయ విస్తరణాధికారిగా పదేళ్ల క్రితం విధుల్లో చేరాను. మాది రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం దుబ్బతండా. మా నాన్న థావుర్యా ఆర్‌టీసీ డ్రైవర్. ఆ కుటుంబంఅంతా వ్యవసాయం చేసేవారు కావడంతో నేను బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి 2017 వ్యవసాయ విస్తరణాధికారిగా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం కొండమల్లేపల్లి మండలంలో ఏఈఓగా రైతులకు సేవలందిస్తున్నాను. నా విద్యాభ్యాసం పూర్తిగా కొండమల్లేపల్లిలోనే పూర్తికావడం ఇక్కడి రైతులకు తనవంతుగా సేవలందించడం ఎంతో ఆనందంగా ఉంది.
– మాధురి, ఏఈఓ, కొండమల్లేపల్లి


