‘సర్‌’లో తప్పిదాలు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో తప్పిదాలు చేయొద్దు

Jul 4 2026 2:25 AM | Updated on Jul 4 2026 2:25 AM

చిట్యాల : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో ఎన్యుమరేషన్‌ ఫారాలను పూరించటంలో ఓటర్లు తప్పిదాలు చేయకుండా చూడాలని స్టేట్‌ డిప్యూటీ ఎలక్షన్‌ ఆఫీసర్‌ రామ్‌ప్రసాద్‌రావ్‌, ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి బీఎల్‌ఓలకు సూచించారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ, ఉరుమడ్ల గ్రామాల్లో ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ, పత్రాలను పూరించిన అనంతరం బీఎల్‌ఓలకు అందజేసే కార్యక్రమాన్ని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.విజయ్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఆర్‌ఐ జానిషరీఫ్‌, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement