నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణానికి చెందిన తేలు ఈశిత్వ శ్రీకృష్ణ యువ షూటర్‌గా జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. పదో తరగతి చదువుతున్న ఆమె చిన్న వయసులోనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తనకంటూ ప్రత్యేకత చాటుతోంది. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రైఫిల్ ఛాంపియన్‌షిప్ –2026 పోటీల్లో 400గాను 393 స్కోర్ సాధించి రెండ రజత పతకాలు కై వసం చేసుకుంది. టీం ఇండియా సెలక్షన్ ట్రయల్ –3లో 610 స్కోర్, సెలక్షన్ ట్రయల్ –4 లో 610.9 స్కోర్ సాధించి ట్రయల్ –5, 6కు ఎంపికై ంది. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన ఈశిత్వ శ్రీకృష్ణను పలువురు అభినందించారు.


