నకిరేకల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్స్ అండ్ ట్రైనింగ్) రాష్ట్ర పరిశీలకుడు రమేష్ అన్నారు. నకిరేకల్ మండలం చందంపల్లి, నకిరేకల్‌లోని జెడ్పీ హైస్కూళ్లను గురువారం ఆయన డీఈఓ సుశీందర్‌రావు తో కలిసి సందర్శించారు. చందంపల్లిలో ప్రీప్రైమరీ బోధన తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, బోధన విధానం, పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన వెంట ఎంఈఓ మేక నాగయ్య, జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం కోదాటి రాములు, చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం నవీన్‌రెడ్డి తదితరులున్నారు.
అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
చిట్యాల: ప్రాథమిక స్థాయి తరగతుల్లోని విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, డీఈఓ సుశీందర్‌రావు తెలిపారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ప్రీప్రైమరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్‌ను గురువారం వారు సందర్శించారు. వారి వెంట ఎంఈఓ సైదానాయక్, హెచ్‌ఎంలు అరుణ, శ్రీనివాస్ తదితరులున్నారు.
ఫ ఎస్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకుడు రమేష్


