వివరాలు పక్కగా అప్‌లోడ్ చేస్తాం
నల్లగొండ టూటౌన్: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను డిమాండ్‌ను లెక్కించేందుకు ప్రభుత్వం ‘భువన్ సర్వే’ రెండో విడతకు శ్రీకారం చుట్టింది. ఫేస్–1లో గతేడాది 14వేల భవనాలకు కొలతలు తీసుకొని భువన్ సర్వే ప్రకారం ఇంటి యజమాని, భవనానికి చెందిన సమగ్ర వివరాలను పక్కాగా అప్‌లోడ్ చేశారు. నగరంలోని 48 డివిజన్లలో దాదాపు 48 వేల అసిస్‌మెంట్‌లు ఉండగా.. ఈ ఏడాది ఫేస్–2 కింద 18,003 భవనాలను కొలతలు తీసుకుని ఆస్తిపన్ను నిర్ధారించనున్నారు. ఆయా డివిజన్లలో ఎంపికై న ఇంటి నంబర్లకే భువన్ సర్వే చేయనున్నారు.
పక్కాగా భవనాల ఆస్తి పన్ను..
భువన్ సర్వే నగరంలోని 18,003 భవనాలకు పక్కాగా ఆస్తి పన్ను లెక్కించడంతో పాటు అన్ని ధ్రువపత్రాలను తీసుకొని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. సంబంధిత ఇంటి నంబర్ పై ఒక్క క్లిక్‌తో ఇంటి యాజమాని, ఇంటి అనుమతుల ధ్రువపత్రాలు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, కుళాయి నంబర్, భవనం ఎన్ని అంతస్తులు, వాణిజ్యమా, నివాస భవనమా అనే వివరాలు తెలుస్తాయి.
పెరగనున్న డిమాండ్ ...
నగరంలోని పలు డివిజన్లలో పాత వాటి స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టినవి ఉన్నాయి. ఇటీవల నివాస భవనాల స్థానంలో కమర్షియల్ భవనాలు భారీగా వెలిశాయి. ఈ భువన్ సర్వే చేయడం ద్వారా డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. గత నాలుగైదేళ్లుగా నగరంలో ప్రైవేట్ ఆస్పత్రుల భవనాలు, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు, కార్పొరేట్ షాపింగ్ మాల్స్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో భువన్ సర్వే చేయడం ద్వారా ఆస్తి పన్ను డిమాండ్ కూడా పెరుగనుంది. గతేడాది భువన్ సర్వే చేయడంతో రూ. 2 కోట్లు డిమాండ్ పెరిగింది. కానీ ఈ ఏ డాది భువన్ సర్వే ఎక్కువ భాగం విలీన గ్రామాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 6 వేల భవనాల వరకు విలీన గ్రామాల్లో ఉండగా, మిగతావి పట్టణంలోనే ఉన్నాయి. ఈ సారి కూడా ఆస్తి పన్ను డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఫ 18,003 భవనాలకు పక్కా లెక్క
ఫ ఆస్తి పన్ను నిర్ధారణే లక్ష్యంగా అధికారుల కసరత్తు
ఫ ఈసారి విలీన గ్రామాలపైనే ఫోకస్
భువన్ సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. డివిజన్ల వారీగా ఇంటి నంబర్లను విభజించి వార్డు ఆఫీసర్లకు ఇచ్చారు. త్వరలోనే సర్వే ప్రారంభించి అన్ని వివరాలు సేకరించి అప్‌లోడ్ చేస్తాం.
– శివరాంరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్


