వాన ఎక్కువే కురిసింది! | - | Sakshi
Sakshi News home page

వాన ఎక్కువే కురిసింది!

Jul 2 2026 2:53 AM | Updated on Jul 2 2026 2:53 AM

వేంపాడులో అసంపూర్తి భవనంలోనే విద్యాబోధన ఒంటికి..రెంటికి బయటకే.. విద్యార్థులు ఎక్కువ.. ఉపాధ్యాయులు తక్కువ

వర్షపాతం నమోదు ఇలా..

అన్నింటికి బయటకే వెళ్లుతున్నాం

నల్లగొండ అగ్రికల్చర్‌ : జూన్‌ మాసంలో జిల్లాలో కురవాల్సిన వర్షం కంటే అధిక వర్షం కురిసినట్లు చీఫ్‌ ప్లానింగ్‌ కార్యాలయం వెల్లడించింది. ప్రతిరోజూ మండలాల వారీగా ఎంత వర్షం కురిసిందనే నివేదికను జిల్లా ప్రణాళిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. జిల్లాలో జూన్‌ చివరి నాటికి సాధారణ వర్షం 86.8 మిలీమీటర్లకు 126.5 కురిసి 45.8 మిల్లీమీటర్ల అధికంగా నమోదైనట్లు తన నివేదికలో చీఫ్‌ ప్లానింగ్‌ కార్యాలయం వెల్లడించింది. జిల్లా వ్యాప్తంగా 33 మండలాలకు గాను కట్టంగూర్‌, నకిరేకల్‌, తిప్పర్తి, నల్లగొండ, అనుముల హాలియా, నిడమనూరు, తిరుమలగిరి సాగర్‌, నేరడుగొమ్ము, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట, చండూరు, గట్టుప్పల్‌తో కలిపి 13 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసిందని పేర్కొంది. అదేవిధంగా చిట్యాల, నార్కట్‌పల్లి, శాలిగౌరారం, కనగల్‌, త్రిపురారం, మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి, పెద్దవూర, చింతపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, గుడిపల్లి, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసినట్లు నివేదించింది. కేవలం కేతేపల్లి, పీఏపల్లి మండలాల్లో మాత్రమే దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తన నివేదికలో తెలియజేసింది.

ఈ సీజన్‌లో పంటల సాగు తక్కువే..

జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులు పత్తి విత్తనాలు పెట్టుకోవడంతో పాటు వరినారు పోసుకునే వారు. కానీ, ఇప్పటి వరకు కేవలం 2 లక్షల 10,350 ఎకరా ల్లో పత్తి గింజలు పెట్టుకున్నప్పటికీ అవి ఇప్పటికీ మొ లకెత్తని పరిస్థితి నెలకొంది. జొన్న 124, కంది 406 ఎకరాల్లో సాగు చేసుకోగా వరి 124 ఎకరాల్లో మా త్రమే నాట్లు వేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ఎలాంటి వర్షపాతం నమోదైందో స్పష్టమవుతోంది.

నిడమనూరు మండలం వేంపాడు ప్రాథమిక పాఠశాల భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. గతంలో రూ.5 లక్షలతో ఒక తరగతి గది, వరండా నిర్మాణం చేపట్టగా, నిర్మాణ వ్యయం పెరిగిందని నిర్మాణ పనులు నిలిపివేశారు. మరోవైపు వంట గది నిర్మాణ పనులు కూడా నిలిపివేశారు. అసంపూర్తి భవనంలోనే బోధనను కొనసాగిస్తున్నామని, సొంత డబ్బులతో ఫ్లోర్‌ పనులు చేయిస్తున్నామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తోంది. తరగతి గదుల్లేక చెట్ల కింద చదువులు, ఒకే తరగతి గదిలో రెండు మూడు తరగతులకు బోధన చేస్తుండడంతో విద్యార్థులకు పాఠాలు అర్థం కావడం లేదని వాపోతున్నారు. టాయిలెట్లు లేక మూత్రం వస్తే ఉగ్గపట్టుకోవాల్సి పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆట స్థలాలు లేక విద్యార్థులు క్రీడలకు దూరం అవుతుండగా స్కూళ్లకు ప్రహరీలు లేక ఎప్పుడు ఏ విషపురుగులు తరగతి గదుల్లోకి వస్తాయోనన్న ఆందోళనలో చదువుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో 3,731 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిల్లో 3,89,592 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల్లో ఒక్కో స్కూళ్లో ఒక్కో సమస్యతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.

మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 156 మంది విద్యార్ధులు ఉన్నారు. ఇక్కడ బాలుర కోసం టాయిలెట్లు లేకపోవడంతో ఆరుబయటకే వెళ్లాల్సి వస్తుంది. విద్యార్ధులకు ఆడుకునేందుకు ఆటస్థలం కూడా లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు.

డోర్లు లేక ఇబ్బందులు

మిర్యాలగూడలోని ఎన్‌ఎస్‌పి క్యాంపు బకల్‌వాడ ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్ధులు ఉన్నారు. ఇక్కడ సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేరు. ఉన్న వాటికి డోర్లు లేకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పాఠశాలలో ఆట స్థలం ఉన్నప్పటికీ వర్షాల కారణంగా నీళ్లు నిలుస్తుండడంతో విద్యార్ధులు ఇబ్బందులు తప్పడం లేదు.

ఒకటే మరుగుదొడ్డి

మిర్యాలగూడ పట్టణంలోని గాంధీపార్క్‌ యూిపీఎస్‌లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. 336 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్‌ ఉంది. దానిని ప్రాథమిక తరగతులకు ఒక మరుగుదొడ్డి మాత్రమే ఉంది. అది బాలికలకు వినియోగిస్తున్నారు. బాలురకు టాయిలెట్‌ లేకపోవడంతో వారంతా ఆరు బయటకే వెళ్లాల్సి వస్తోంది.

మండలాల వారీగా జూన్‌లో వర్షపాతం (మిల్లీమీటర్లలో..)

పాఠశాలల్లో కనీస వసతులు కరువు

ఫ తరగతి గదులు సరిపోక చెట్ల కిందే చదువులు

ఫ ఒకే గదిలో రెండు మూడు తరగతులకు బోధన

ఫ పిల్లలు ఎక్కువ మూత్రశాలలు, మరుగుదొడ్లు తక్కువ

ఫ ఇబ్బందుల్లో విద్యార్థులు

ఫ 13 మండలాల్లో సాధారణ వర్షపాతం

ఫ 18 మండలాల్లో భారీ వర్షాలు

ఫ కేతేపల్లి, పీఏపల్లిలోనే దుర్భిక్షం

ఫ జూన్‌లో కురవాల్సింది 86.8..కురిసింది 126.5 మి.మీ.

ఫ చీఫ్‌ ప్లానింగ్‌ కార్యాలయ నివేదికలో వెల్లడి

వర్షపాతం నమోదుకు మండల స్థాయిలో మండల రెవెన్యూ కార్యాలయంలో గేజ్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడ కురిసిన వర్షాన్ని బట్టి గేజ్‌లో నమోదైన వర్షాన్ని బట్టి మండలమంతా అదే స్థాయిలో వర్షం కురిసిందని మండల స్థాయి అధికారులు సీపీఓకు నివేదిస్తారు. ప్రస్తుతం జిల్లాలో మండలంలో ఒక గ్రామంలో వర్షం కురిస్తే పక్క గ్రామంలో కూడా వర్షం కురవని పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్‌నివో ప్రభావంతో రుతుపవనాలు సరైన దిశలో పయనించక వర్షాలకు ఆటంకం కలుగుతున్న పరిస్థితి. గ్రామ స్థాయిలోనే వర్షపాతం నమోదుకు పరికరాలను ఏర్పాటు చేసి నమోదు చేస్తేనే వర్షపాతం లెక్కలు పక్కాగా తేలనున్నట్టు నిపుణులు అంటున్నారు.

స్కూళ్లో టాయిలెట్‌ ఒకటే ఉండటంతో బాలికలు మినహా బాలురంతా ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల చుట్టూ ఇండ్లు ఉండటంతో కొంత ఇబ్బందులు తప్పడం లేదు. ఆట స్థలం కూడా లేకపోవడంతో క్రీడలకు దూరం అవుతున్నాం.

– పరమేష్‌, 10వ తరగతి, బంగారుగడ్డ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement