శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దు | - | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దు

Jul 2 2026 2:53 AM | Updated on Jul 2 2026 2:53 AM

మిర్యాలగూడ అర్బన్‌ : శాంతి భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ హెచ్చరించారు. మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం రాత్రి పోలీసులు నాకాబందీ (కార్డన్‌ సెర్చ్‌) నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 150 వాహనాలపై, అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడిన 40మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అర్ధరాత్రి వరకు అనవసరంగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం, బైక్‌ రేసింగ్‌, గుంపులుగా తిరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. గంజాయి, గుట్కా, జూదం, అక్రమ మద్యం విక్రయాలు, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దన్నారు. ఇకపై కార్డన్‌ సెర్చ్‌లు నిరంతరం కొనసాగిస్తామన్నారు. పట్టణంలోని దాబాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, టీ స్టాళ్లు తదితర వ్యాపార సంస్థల నిర్వాహకులు నిర్దేశిత సమయానికే మూసి వేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, సీఐ ఉ నాగభూషణరావు, సోమనర్సయ్య, పీఎన్‌డీ.ప్రసాద్‌, ఎస్‌ఐలు, ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

ఫ మిర్యాలగూడలో కార్డన్‌ సెర్చ్‌

ఫ సరైన పత్రాలు లేని 150 వాహనాలపై కేసులు

ఫ డ్రంక్‌ అండ్‌డ్రైవ్‌లో 40మంది పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement