‘వీబీజీ రామ్‌జీ’ని రద్దుచేయాలి | - | Sakshi
Sakshi News home page

‘వీబీజీ రామ్‌జీ’ని రద్దుచేయాలి

Jul 2 2026 2:53 AM | Updated on Jul 2 2026 2:53 AM

నల్లగొండ టౌన్‌: గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుమార్చి అమల్లోకి తెచ్చిన వీబీజీ రామ్‌ జీ పథకాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నల్లగొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ మాట్లాడుతూ పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ.. పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఉపాధి పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో చినపాక లక్ష్మీనారాయణ, దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్‌, ఊట్కూరి నారాయణరెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement