నల్లగొండ: జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఏడాదిలోపు పూర్తిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్) పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. ప్రాజెక్టుల పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) శ్రీకాంత్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్లు, ఆర్‌డీఓలు, ఇరిగేషన్ శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలు, ల్యాండ్ అక్విజిషన్ అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


