డిగ్రీ కళాశాలల పని వేళలు మార్చాలి | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ కళాశాలల పని వేళలు మార్చాలి

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 1:52 AM

తుంగతుర్తి: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలల పని వేళలను మార్చాలని గురుకుల డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ తన్నీరు గిరిప్రసాద్‌ కోరారు. మంగళవారం బీసీ గురుకులాల డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో కలిసి హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కోదండరాంకు ఈ మేరకు వినతి పత్రం అందించారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కళాశాలలు కొనసాగుతున్నాయని, ఎస్సీ గురుకులాల పని వేళలకు అనుగుణంగా ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించేలా మార్పు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజ్యశ్రీ, డాక్టర్‌ కిషోర్‌, అధ్యాపకులు డాక్టర్‌ దీప్తి, సుమాంజలి, శిరీష, వినీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement