కేతేపల్లి : రైతాంగ అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. సోమవారం మూసీ ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమ కాల్వలకు ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. ప్రతి ఎకరాకు సాగు నీరందించి తెలంగాణను సస్యశామలం చేయటమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. మూసీ రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉండటంతో రైతులు నాట్లు వేసుకునేందుకు వీలుగా నీటిని విడుదల చేస్తున్నామన్నారు. నీరు చివరి భూములకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మూసీ ప్రాజెక్టు డీఈ రమేష్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి, ఎన్‌డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బోళ్ల వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోట మల్లికార్జునరావు, సర్పంచ్‌లు బొజ్జ సుందర్, బీరం జాన్‌రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎడ్ల ప్రవీణ్, మందడి వెంకట్రామ్‌రెడ్డి, బడుగుల నరేందర్, కత్తుల వీరయ్య, అల్లి అంజన్‌యాదవ్ పాల్గొన్నారు.
ఫ మూసీ కాల్వలకు నీటి విడుదల


