చిట్యాల (నార్కట్‌పల్లి): ఏరువాక పౌర్ణమి సందర్భంగా నార్కట్‌పల్లి మండలంలోని కొండపాకోనిగూడెం గ్రామంలో రైతు బిడ్డల పొలం బాట కార్యక్రమాన్ని సోమవారం ‘భూమి’ సునీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రైతులతో మాట్లాడారు. సాగు పనులు మొదలుపెడుతున్న తరుణంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమకు ఉన్న ఇబ్బందులను వివరించగా వారి సందేహాలు ఆయన నివృత్తి చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేలా అవసరమైన సాయం అందేలా సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యతతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.


