కట్టంగూర్ : మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం రాత్రి కురిసింది. దీంతో మండల కేంద్రంలోని పల్లె సత్తయ్యకు చెందిన ఇంటి పైకప్పు సిమెంట్ రేకులు కూలిపోయాయి.
మహిళ అదృశ్యం
హుజూర్‌నగర్ (మేళ్లచెరువు) : మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన తోడేటి లక్ష్మి ఈ నెల 24న ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి స్వతహాగా దైవ భక్తురాలని, కావున దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినట్లు భావిస్తున్నామని ఎస్‌ఐ నవీన్‌కుమార్ తెలిపారు. లక్ష్మి ఆచూకీ తెలిసిన వారు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ సూచించారు.
మహాశివుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు చేసి భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


