యూరియా బుకింగ్‌ యాప్‌ అప్‌డేట్‌ చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

యూరియా బుకింగ్‌ యాప్‌ అప్‌డేట్‌ చేసుకోండి

Jun 30 2026 7:01 AM | Updated on Jun 30 2026 7:01 AM

భువనగిరిటౌన్‌ : రైతులు యూరియా బుకింగ్‌ యాప్‌ను(ఫర్టిలైజర్‌) వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని వ్యవసాయాధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ యాప్‌ అప్‌డేట్‌ కాకపోతే పాత యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసి మళ్లీ గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి కొత్త వెర్షన్‌న్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వివరించారు. నూతన యాప్‌ 1.0.12 అని చూపిస్తుందో లేదో సరిచూసుకోవాలన్నారు. ఈ యాప్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు టోల్‌ఫ్రీ నంబర్‌ 18001237157 ద్వారా వినియోగదారుల సేవా కేంద్రాన్ని(కస్టమర్‌ కేర్‌) సంప్రదించవచ్చని, మొబైల్‌ యాప్‌ సేవలు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.

జాతీయ బ్యాడ్మింటన్‌

పోటీలకు ఎంపిక

మిర్యాలగూడ : రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో రజత పతకం సాధించిన నల్లగొండ జిల్లాకు చెందిన వనమాల శశాంక్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన 12వ యూనిక్స్‌ సన్‌రైస్‌ అండర్‌–19 స్టేట్‌ ఛాంపియన్‌షిప్‌లో శశాంక్‌ ఈ ఘనత సాధించాడు. శశాంక్‌ ప్రస్తుతం గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడు జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై నల్లగొండ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు అంజయ్య, అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ప్రశాంత్‌, పి. నవీన్‌కుమార్‌, జిల్లా కోచ్‌ రామకృష్ణ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement