పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌డేలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ 33 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు చట్ట పరంగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
దేవరకొండ డీఎస్‌పీగా శ్రీనివాస్‌రావు
దేవరకొండ : దేవర కొండ డీఎస్‌పీగా ఎంవీ శ్రీనివాస్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్ర స్తుతం ఇక్కడ పని చేస్తున్న ఏఎస్పీ పి.మౌనిక ఆదిలా బాద్‌కు బదిలీ కాగా రాచకొండ మల్కాజ్‌గిరి ట్రాఫిక్ ఏఎస్పీగా పని చేస్తున్న ఎంవీ శ్రీనివాస్‌రావు దేవరకొండ డీఎస్‌పీగా బదిలీపై వచ్చారు.
30వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ
నల్లగొండ : ఆసరా పింఛన్లను ఈ నెల 30 తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాపీస్‌లలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని సూచించారు.
క్షయ రోగులను గుర్తించాలి
నల్లగొండ టౌన్ : క్షయ రోగులను గుర్తించి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ సూచించారు. సోమవారం నల్లగొండలోని టీఎన్‌జీవో భవన్‌లో పీహెచ్‌సీల వైద్యదులు,క సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెపటైటిస్ వ్యాధికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు కూడా పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించారు. టీబీ నివారణలో భాగంగా పోలీసులకు ఎక్స్‌రేలు చేయించాలని సూచించారు. గర్భిణులకు సేవలందించడంలో వెనుకబడిన పీహెచ్‌సీలకు మెమోలు జారీ చేశారు. సమావేశంలో డాక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, కృష్ణకుమారి, అరుందతి, పద్మ, తిరుపతిరావు పాల్గొన్నారు.
తూకాల్లో మోసాలకు పాల్పడొద్దు
వేములపల్లి : ధాన్యం కాంటాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి వి.శ్రీనివాసులు అన్నారు. సోమవారం వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారులో రైస్ మిల్లుల వద్ద గల శాంతి వేబ్రిడ్జి, శ్రీరామ వేబ్రిడ్జిలతోపాటు శ్రీలక్ష్మీరైస్ మిల్లుల్లోని వేబ్రిడ్జిలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. తూకాల విషయంలో రైతులను మోసగిస్తే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. రైతులు తమ ధాన్యం తూకాల్లో ఏమైనా అవకతవకలు జరిగితే తమకు ఫిర్యాదు చేస్తే వేబ్రిడ్జిలను తనిఖీ చేస్తామని.. మోసాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటేశ్వర్లు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ


