సమైక్యతా శిబిరానికి వలంటీర్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొనే వలంటీర్లను సోమవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన వలంటీర్లకు భాషా పరిజ్ఞానం, కమ్యునికేషన్ స్కిల్స్, సాంస్కృతిక అంశాలపై ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపిక చేశారు. ఇక్కడ ఎంపికై న వారు ఈనెల 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరానికి హాజరుకానున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మద్దిలేటి తెలిపారు. ఎంపికై న వారిని యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అలువాల రవి, ప్రొఫెసర్ అంజిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, చాంద్‌పాషా, ఆనంద్, కవిత, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.


