గ్రీవెన్స్‌లో భూ సమస్యల గోడు
నల్లగొండ : గ్రీవెన్స్‌లో భూ సమస్యలపైనే దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. తమ పిల్లలు భూములు పట్టా చేసుకుని తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు.. పిల్లలు భూమి రిజిస్ట్రేషన్ చేయాలని వేధిస్తున్నారని మరి కొందరు తల్లిదండ్రులు కలెక్టకు విన్నవించారు. వీటితోపాటు భూమి పట్టా కాలేదని, పాస్ పుస్తకంలో ఎక్కలేదని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల కోసం పలువురు దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్.. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించగా.. మరికొన్నింటిని పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు.
నాకు ఇద్దరు కొడుకులు. నాకున్న 14 ఎకరాల్లో చెరి ఐదెకరాల చొప్పున పట్టా చేశాను. 4 ఎకరాలు నా పేరున ఉంది. నా చిన్న కొడుకు శ్రీనివాస్‌రెడ్డి ఊరిలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. అతను ఆ 4 ఎకరాలు పట్టా చేయమని ఒత్తిడి చేస్తుండు. పొలాన్ని కౌలుకు ఇవ్వనీయకుండా పడావు పెట్టాడు. నా తదనంతరం ఇద్దరు కొడుకులు పంచుకోవచ్చు. ఆ భూమి నేను ఇప్పుడు వారికి ఇవ్వను.. నాకు న్యాయం చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ కొడుకుతో మాట్లాడి అవసరమైతే కేసు పెట్టాలని ఐసీడీఎస్ ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి నాగిరెడ్డిని ఆదేశించారు.
– కంచర్ల సుగుణమ్మ, ఉట్లపల్లి,
మిర్యాలగూడ మండలం
పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని
కలెక్టర్‌కు విన్నవించిన వృద్ధులు
గ్రీవెన్స్‌లో భూ సమస్యల గోడు


