టీఆర్‌టీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని టీఆర్‌టీఎఫ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో టీఆర్‌టీఎఫ్ (తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా తంతెనపల్లి సైదులు వ్యవహరించగా, జిల్లా అధ్యక్షుడిగా నిమ్మనగోటి జనార్దన్, కార్యదర్శిగా తరాల పరమేశ్‌యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నిబంధనను సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. టెట్ అంశంపై డిసెంబర్ 11న న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్‌టీఎఫ్ అసోసియేట్ ప్రెసిడెంట్ అర్రూరి జానయ్య, బెజవాడ సూర్యనారాయణ, దొడ్డేని సాయిబాబు, ముప్పిడి మల్లయ్య, గడ్డం జానకిరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
టీఆర్‌టీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక


