
యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలం
కేతేపల్లి: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కేతేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఏనాడూ ఇబ్బందులు పడలేదన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే యూరియా అవసరాన్ని అంచనా వేసి సిద్ధ చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. రైతులు యూరియా కోసం చెప్పులు లైన్‌లో పెట్టే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి సరిపడా యూరియా తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నకిరేకల్ ఏఎంసీ మాజీ చైర్మన్ కె. ప్రదీప్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సభ్యుడు బడుగుల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చియట వెంకన్న, నాయకులు బంటు మహేందర్, బొప్పని సురేష్, కె. సైదిరెడ్డి, ఆర్. సైదులు, దండు వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య