
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. బాధితుల నుంచి 85 ఫిర్యాదులు రాగా రెవెన్యూ శాఖకు 50, ఇతర శాఖలకు సంబంధించి 35 వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సమస్య పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను ఫిర్యాదుదారులకు వివరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా సకాలంలో పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇబ్బంది రావొద్దు
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మెటీరియల్ ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్న ప్రాసెసింగ్ యూనిట్‌కు వేయి మెట్రిక్ టన్నుల ఇసుక ఇచ్చేందుకు జిల్లాస్థాయి ఇసుక కమిటీ తీర్మాణించిందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మైన్స్ శాఖ సహాయ సంచాలకుడు జాకబ్, డీపీఓ వెంకయ్య, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, గ్రౌండ్ వాటర్ డీడీ రమాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఇంజనీర్ శాంతకుమారి, టీజీఎండీిసీపీఓ మధు తదితరులు అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలి