యూరియా గోస! | - | Sakshi
Sakshi News home page

యూరియా గోస!

Aug 26 2025 8:12 AM | Updated on Aug 26 2025 8:12 AM

యూరియ

యూరియా గోస!

శాలిగౌరారం : శాలిగౌరారం మండలానికి సోమవారం 1554 బస్తాల యూరియా వచ్చింది. అందులో మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు 444 బస్తాలు, సాయినాథ్‌ ఫర్టిలైజర్‌కు 222 బస్తాలు, పెర్కకొండారం ఆగ్రో రైతుసేవా కేంద్రానికి 444 బస్తాలు, మహాలక్ష్మి ఫర్టిలైజర్‌కు 444 బస్తాలు వచ్చింది. యూరియాను కొనుగోలు చేసేందుకు సంబంధిత కేంద్రాల వద్దకు సోమవారం తెల్లవారుజాము నుంచే రైతులు వచ్చి చెప్పులను క్యూలైన్‌లో పెట్టారు. ఉదయం తొమ్మిది గంటలకు మండల వ్యవసాయ అధికారి సౌమ్యశృతి, ఏఈఓలు యూరియా విక్రయ కేంద్రాలకు చేరుకొని రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా అందించారు. మండల వ్యాప్తంగా 750 మంది రైతులకు యూరియా అందించినట్లు ఏఓ తెలిపారు. 750 మందికే యూరియా మొత్తం అయిపోవడంలో లైన్‌లో నిలుచున్న అనేక మంది రైతులు నిరాశతో వెనుదిరిగిపోయారు.

ఒక్కో రైతుకు బస్తానే..

మిర్యాలగూడ అర్బన్‌: మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో గల పీఏసీఎస్‌ వద్ద యూరియా కోసం రైతులు సోమవారం తెల్లవారుజాము నుంచి చెప్పులు క్యూ లైన్‌లో బారులుదీరారు. ఒక్క లారి లోడు యూరియా రావడంతో ఒక్కో రైతుకు ఒక్క బస్తానే ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫర్టిలైజర్‌ వద్ద నిరీక్షణ

కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లిలోని ఫర్టిలైజర్‌ దుకాణం ఎదుట సోమవారం రైతులు యూరియా కోసం బారులుదీరారు. ఇక పీఏసీఎస్‌కు ఒక్కలోడ్‌ యూరియా రాగా ఒక్కో రైతుకు రెండు బస్తాలు అందించారు.

యూరియా కోసం తప్పని తిప్పలు

పెద్దవూర : మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు శని, సోమవారాల్లో యూరియా వచ్చింది. దీంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉదయం ఆరు గంటల నుంచే క్యూ కట్టారు. పెద్దవూరలో రైతుల నుంచి యూరియా కోసం వచ్చిన రైతుల నుంచి పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ పేపర్‌లను తీసుకుని ఆ తర్వాత రైతులను పిలిచి వేలి ముద్రలు నమోదు చేసుకుని, డబ్బులు తీసుకుని రశీదులు ఇచ్చారు. ఆ తర్వాత అధికారులు వచ్చి వరుసగా వాటిని తీసుకుని రైతుకు మూడు బస్తాల చొప్పున యూరియా ఇచ్చారు. యూరియా కొరత లేదని రోజూ పీఏసీఎస్‌కు యూరియా వస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఓ సందీప్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం యూరియా అవసరం ఉన్న రైతులు మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. పొలంలో రెండోసారి యూరియా చల్లేటప్పుడు నానో యూరియా పిచికారీ చేసుకోవాలని పేర్కొన్నారు.

ఫ తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్‌ల వద్ద రైతుల బారులు

ఫ చెప్పులు, ఆధార్‌ కార్డులు క్యూలో పెట్టి నిరీక్షణ

ఫ ఒక్కో రైతుకు.. ఒకటి రెండు బస్తాలు ఇస్తున్న సిబ్బంది

ఫ కొందరికి అసలే అందక నిరాశ

యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారు. అదునుకు యూరియా వేయకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన

చెందుతున్నారు. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్‌ కేంద్రాల వద్ద

పడిగాపులు కాస్తున్నారు. అయినా ఒక్కో రైతుకు ఒకటి.. రెండు బస్తాలే ఇస్తుండడం.. కొందరి అసలే దొరకకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

యూరియా గోస!1
1/2

యూరియా గోస!

యూరియా గోస!2
2/2

యూరియా గోస!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement