‘పవిత్ర’ వృత్తికి జాతీయ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

‘పవిత్ర’ వృత్తికి జాతీయ గుర్తింపు

Aug 26 2025 8:12 AM | Updated on Aug 26 2025 8:12 AM

‘పవిత

‘పవిత్ర’ వృత్తికి జాతీయ గుర్తింపు

ప్రయోగ బోధనతో ఆకట్టుకునేలా...

మారం పవిత్ర ఏ స్కూల్‌లో పనిచేసినా ఆమె విద్యార్థులకు అర్థవంతంగా బోధిస్తూ వారి చేతనే తగిన ప్రయోగాలు చేయిస్తారు. విద్యార్థుల ఉన్నతికి ఆమె చేస్తున్న కృషి గుర్తించి ఇప్పటికే పలు అవార్డులు ఆమె సొంతమయ్యాయి. విద్యార్థులతో ఎన్నో రకాల ప్రయోగాలు చేయించి సైన్స్‌ఫెయిర్‌లలో రాష్ట్ర, స్థాయికి తమ ఎగ్జిబిట్లను తీసుకెళ్లారు. యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా సైతం ఉపాధ్యాయులకు అవగాహన తరగతులు బోధించారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తనదైన శైలిలో ప్రయోగ బోధనలు అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.

సూర్యాపేటటౌన్‌ : పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్‌ 5న గురుపూజోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయికి ఆరుగురు దరఖాస్తు చేసుకోగా సూర్యాపేట జిల్లాకు చెందిన మారం పవిత్రకు ఒక్కరికే ఈ అవార్డు రావడం పట్ల పలువురు సైన్స్‌ టీచర్లు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 45 మంది ఆయా రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయగా అందులో పెన్‌పహాడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మారం పవిత్ర ఎంపిక కావడం విశేషం.

విద్యార్థుల ఎగ్జిబిట్‌తో టీచర్‌ పవిత్ర

ఫ జీవశాస్త్రం టీచర్‌ పవిత్రకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

ఫ రాష్ట్రం నుంచి ఈమె ఒక్కరే ఎంపిక ఫ హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ వర్గాలు

‘పవిత్ర’ వృత్తికి జాతీయ గుర్తింపు1
1/1

‘పవిత్ర’ వృత్తికి జాతీయ గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement