
కాల్వ భూమి కబా్జ..!
చర్యలు తీసుకుంటాం
అధికారుల పాత్రపై అనుమానాలు..
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ గల ప్రభుత్వ, ఎన్‌ఎస్పీ భూముల ఆక్రమణ పరంపర కొనసాగుతోంది. కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణం రోజురోజుకు విస్తరిస్తుండటంతో పంట పొలాలు ప్లాట్లుగా మారిపోయాయి. గతంలో పంట పొలాలకు సాగునీరు అందించిన ఎన్‌ఎస్పీ కాల్వ స్థలాలను కొందరు కబ్జాదారులు తమ కబంద హస్తాల్లో పెట్టుకుంటున్నారు. ఇలా పట్టణంలోని చిల్లాపురం రోడ్డులో రవీంద్రనగర్ కాలనీ ప్రధాన రోడ్డు వెంట ఉన్న ఎన్‌ఎస్పీ కాల్వ స్థలం తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమి అంటూ తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన సంచలనంగా మారింది.
కబ్జాచేసిన తీరు ఇలా..
ఎన్‌ఎస్పీ ప్రధాన కాల్వకు అనుబంధంగా పిల్లకాల్వ కిలోమీటర్ మేర ఉంది. ప్రస్తుతం రవీంద్రనగర్ కాలనీ.. బంజారాహిల్స్‌గా పిలువబడి పట్టణంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా పేరుంది. సర్వే నంబర్ 219, 220లో ఎన్‌ఎస్పీ భూమి ఉంది. ఇక్కడ గజం స్థలం రూ.25 వేలకు పైగా పలుకుతుంది. అంతటి విలువైన భూమిపై కన్నేసిన పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఎన్‌ఎస్పీకి చెందిన 576 గజాల కాల్వ స్థలం కబ్జా చేసి అక్కడ తాత్కాలికంగా ఇంటిని నిర్మించాడు. ఆ భూమిలో తాను 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నానని పేర్కొంటూ 2025లో మున్సిపాలిటీలో తన పేరుపై డోర్ నంబర్ సృష్టించాడు. ఆ డోర్ నంబర్‌తో ఆ భూమిని తన భార్యకు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ భూమి విలువ రూ.కోటిన్నర విలువ చేస్తుంది. ఈ తతంగంలో రూ.లక్షలు చేతులు మారాయని కాలనీలో చర్చ సాగుతోంది. ఈ విషయం కాలనీవాసులు ఎన్‌ఎస్పీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ భూమి ఎన్‌ఎస్పీకి చెందినదని పేర్కొంటూ ఆ స్థలం వద్ద నోటీసులు ఏర్పాటు చేయడంతో పాటు.. చింతపల్లి ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న కాబ్జాదారుడికి సైతం నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
ఫ డోర్ నంబర్ సృష్టించి
తప్పుడు రిజిస్ట్రేషన్
ఫ 576 గజాల కాల్వ స్థలం ఆక్రమణ
ఫ ఆ భూమి విలువ రూ.కోటిన్నర పైమాటే..
ఫ రూ.లక్షలు చేతులు
మారాయని ఆరోపణలు
ఫ కబ్జాదారుడికి నోటీసులు ఇచ్చి
చేతులు దులుపుకున్న అధికారులు
ఎన్‌ఎస్పీ కాల్వకు చెందిన భూమిని కబ్జాచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గతంలోనే సదరు వ్యక్తికి నోటీసులు ఇచ్చాం. తప్పుడు పత్రాలతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేసి విజిలెన్స్ అధికారులకు అందచేస్తాం. వారి ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
– కె.దీక్షిత, ఏఈఈ, మిర్యాలగూడ
ఎన్‌ఎస్పీ కాల్వ స్థలం కబ్జా చేసిన ప్రక్రియలో అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధారాలు లేకుండా డోర్ నంబర్ ఇవ్వడంలో మున్సిపల్ అధికారులకు, ఆ డోర్ నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులకు రూ.లక్షలు ముట్టజెప్పారని తెలుస్తోంది. అందుకే ఎలాంటి పత్రాలు పరిశీలిచకుండా, లింక్ డాక్యుమెంట్లు చూడకుండా రిజిస్ట్రేషన్ చేశారని అర్థమవుతోంది.