
పశువులకు అందని వైద్యం
ఖాళీ పోస్టులు ఇలా..
జిల్లాలో పశు సంపద ఇలా..
120 రకాల మందుల కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. ఇప్పటి వరకు 20 రకాల మందులు వచ్చాయి. మిగతా రకాల మందులు త్వరలో సరఫరా కానున్నాయి. మూగ జీవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాము.
– డాక్టర్ జీవి రమేష్,
జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి
నల్లగొండ అగ్రికల్చర్ : మూగజీవాలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. సీజన్‌ల వారీగా వచ్చే జబ్బులతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో ఒక బహుళార్థక పశువైద్యశాల, 5 ప్రాంతీయ పశు వైద్యశాలలు, 56 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 59 సబ్‌సెంటర్లు, 6 సంచార పశువైద్యశాలలు ఉన్నాయి. కానీ.. సిబ్బంది, మందుల కొరత కారణంగా పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు, కుక్కలకు సరైన వైద్యం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో రూ.69 లక్షల మందుల బడ్జెట్‌ను కేటాయించగా సుమారు 120 రకాల మందులను సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 20 రకాల మందులను మాత్రమే సరఫరా చేసింది. దీంతో సీజన్‌ల వారీగా వచ్చే జబ్బులకు వైద్యం అందించలేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి మూగజీవాలను వైద్యం కోసం తీసుకుపోతే మందుల లేకపోవడంతో వైద్యులు బయటనుంచి కొనుగోలు చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సబ్‌సెటర్లు, ప్రాథమిక పశువైద్య కేంద్రాల్లో మందులు లేక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మూగజీవాలు ధీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
సగం పోస్టులు ఖాళీ..
జిల్లా పశుసంవర్థక శాఖలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో శాఖలో పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 342 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం 208 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పర్యవేక్షణతో పాటు వైద్యం కూడా సక్రమంగా అందని దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే మందులను సక్రమంగా సరఫరా చేయడంతో పాటుగా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని పెంపకందారులు కోరుతున్నారు.
ఫ వేధిస్తున్న సిబ్బంది.. మందుల కొరత
ఫ 120 రకాలకు 20 రకాల
మందులే సరఫరా
ఫ బయటి నుంచి మందుల కొనుగోలు చేయాల్సిన దుస్థితి
ఫ సరైన సమయంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్న పశువులు
అసిస్టెంట్ డైరెక్టర్లు 3
వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ 8
సీనియర్ అసిస్టెంట్ 1
రేడియో గ్రాఫర్ 1
డ్రైవర్ 1
వెటర్నరి లైవ్‌స్టాక్ ఆఫీసర్ 2
జూనియర్ వెటర్నరి ఆఫీసర్ 1
లైవ్‌స్టాక్ అసిస్టెంట్ 4
వెటర్నరి అసిస్టెంట్ 31
ప్లాంట్ ఆపరేటర్ 1
ఆఫీస్ సబార్డినేట్లు 81
మొత్తం 134
పశువులు 2,06,585
గేదెలు 3,17,247
గొర్రెలు 9,50,617
మేకలు 3,44,774
పందులు 7,483
కుక్కలు 12,077
ఫౌల్ట్రీ కోళ్లు 44,33,618