
ఇళ్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి
వలిగొండ: రోడ్డు వెడల్పు పేరుతో తమ ఇళ్లను అక్రమంగా జేసీబీతో కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పులిగిల్ల గ్రామస్తులు బుధవారం వలిగొండ పోలీసులను ఆశ్రయించారు. వలిగొండ నుండి కాటిపల్లి వరకు నూతనంగా బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా గ్రామానికి చెందిన కొంతమంది ఇంటి యజమానులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారు. దీంతో పలువురు బాధితులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
పోలీసులను ఆశ్రయించిన
పులిగిల్ల వాసులు