
మహిళా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లాలి
నల్లగొండ : మహిళ పోలీస్ సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మహిళా పోలీసు సిబ్బంది బ్లూ కోల్ట్స్ విధులను ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. మహిళా పోలీసులు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. మహిళా సిబ్బంది పోలీస్‌స్టేషస్‌లో విధులకే పరిమితం కావొద్దన్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళా పోలీస్ సిబ్బంది బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ రాము, టూటౌన్ సీఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్‌ఐలు సూరప్పనాయుడు, సంతోష్, శ్రీను మహిళా ఎస్‌ఐలు శ్రావణి, విజయబాయి పాల్గొన్నారు.
ఎస్పీ శరత్‌చంద్ర పవార్