ఇద్దరు డీఎస్పీలు బదిలీ
నల్లగొండ : జిల్లాలో ఇద్దరు డీఎస్పీలు బదిలీ అయ్యారు. బాగంగా నల్లగొండ డీసీఆర్‌బీలో పనిచేస్తున్న డీఎస్పీ బి.సైదాను హుజూ రాబాద్‌కు బదిలీ చేశారు. నల్లగొండలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డీఎస్పీ రవికిరణ్‌రెడ్డిని కూకట్‌పల్లి ఏసీపీగా బదిలీ చేశారు. అయితే సైబరాబాద్‌లో డీఎస్పీగా పని చేస్తున్న శ్రీనివాసులును ఎస్బీ డీఎస్పీగా నల్లగొండకు బదిలీ చేశారు.
‘రాజీవ్ యువ వికాసం’లో జిల్లాను ముందుంచాలి
నల్లగొండ : రాజీవ్ యువ వికాసం పథకం అమలులో నల్లగొండ జిల్లాను మంచి స్థానంలో ఉంచేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాజీవ్ యువ వికాస పథకంపై సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా బ్యాంకు కో–ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పథకం కింద వచ్చిన 73,464 దరఖాస్తుల్లో బ్యాంకులకు పంపించిన 73,200 దరఖాస్తులను సిబిల్ అర్హతను పరిశీలించి సంబంధిత ఎంపీడీఓలకు వెంటనే ఇవ్వాలన్నారు. ఎంపీడీఓలు వారి స్థాయిలో అన్ని అర్హతలు పరిశీలించి ఈనెల 25 లోగా జాబితాను తయారు చేయాలని సూచించారు. సిబిల్ అర్హత పరిశీలనలో బ్యాంకర్లు జాప్యం చేస్తే ఫైనాన్స్ సెక్రటరీ దృష్టికి తీసుకెళతామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి శ్రామిక్ మాట్లాడుతూ బ్యాంకర్లు 11 వేల దరఖాస్తుల సిబిల్ అర్హతను పరిశీలించి తిరిగి ఎంపీడీఓఓలకు అందజేశారని, 6500 దరఖాస్తులను అప్‌డేట్ చేశారని తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శేఖర్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నసీరుద్దీన్, మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్‌రెడ్డి, బ్యాంకుల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కమిటీ నియామకం
నల్లగొండ టౌన్ : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీని సోమవారం నియమించారు. అధ్యక్షుడిగా ఎస్‌కే.మొదీన్‌పాష, ప్రధాన కార్యదర్శిగా రావిరాల జగన్, మహిళా అధ్యక్షురాలిగా కె.రమణ, ఉపాధ్యక్షులిగా రోజా పుష్పతో పాటు కార్యవర్గ సభ్యులను నియమించి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గుండ జనార్దన్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎండీ.షేక్‌పాష, జిల్లా కరుణాకర్, మామిడి శంకర్, చంద్రమోహన్, మాచర్ల స్వామి, శంకరయ్య, అంజయ్య, క్రిష్ణయ్య, వెకటమ్మ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
అసంఘటిత రంగ కార్మికులకు అండగా ఉంటాం
రామగిరి(నల్లగొండ) : అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ సేవా అధికార సంస్థ అండగా ఉంటుందని ఆ సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తమరావు అన్నారు. సోమవారం నల్లగొండ న్యాయ సేవధికార సంస్థ కార్యాలయంలో జరిగిన అసంఘటిత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు భద్రత, వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్మికులకు ఇబ్బందులు కలిగిస్తే యాజమాన్యంపై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హక్కులకు భంగం కలిగిస్తే న్యాయ స్థానాల ద్వారా కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో లేబర్ అధికారి రాజు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నిమ్మల భీమార్జున్‌రెడ్డి, కార్మిక నాయకులు ఆచారి, రవి, మదార్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు శిక్షణకు హాజరవ్వాలి
నల్లగొండ : ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి నిర్వహించే వృత్యంతర శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షణన కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని శిక్షణ కేంద్రం ఇన్‌చార్జి, ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇద్దరు డీఎస్పీలు బదిలీ
ఇద్దరు డీఎస్పీలు బదిలీ


