సుందరయ్య ఆశయాలను సాధించాలి
మిర్యాలగూడ : పేదల కోసం నిరంతరం పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను సాధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఈదులగూడెం వద్ద సుందరయ్య విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. సుందరయ్య ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి పేదల కోసం ఉద్యమించారని, పీడిత ప్రజల కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పార్లమెంట్ ప్రతిపక్ష సభ్యుడిగా ఉండి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లి ప్రజా సమస్యలను ప్రస్తావించి అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి సీపీఎం కార్యాలయంలో రక్తదానం చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, జ్యోతి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మువ్వా రామారావు, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీశ్ఛంద్ర, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, రెమిడాల పరుశురాములు, వరలక్ష్మీ, సీతారాములు, వినోద్‌నాయక్, పాదూరి శశిధర్‌రెడ్డి, అయూబ్, అంజాద్, దేశీరాంనాయక్, వెంకట్‌రెడ్డి, బాబునాయక్, శ్రీనివాస్, జగన్‌నాయక్, కోడిరెక్క మల్లయ్య, దేవయ్య పాల్గొన్నారు.


