అడ్డొస్తున్నాడని..
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని వెల్మకన్నె గ్రామానికి చెందిన మహిళ తన భర్తను హతమార్చింది.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై
ఉంటుంది. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
క్షేత్రపాలకుడికి పూజలు
క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని సుందరీమణులు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయంలోని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కారు. అక్కడి నుంచి గర్భాలయంలోకి వెళ్లి స్వయంభూలకు పూజలు నిర్వహించారు. ఆలయ పారాయణీకుడు నల్లంథీఘల్ సీతారామచార్యులు స్వామివారి విశిష్టతను వారికి వివరించారు. అనంతరం చెంతనే ఉన్న ఆండాల్ అమ్మవారిని సుందరీమణులు దర్శించుకున్నారు. సుందరీమణులకు ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్‌శర్మ శ్రీస్వామివారి ప్రతిమతో పాటు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం వారు ఉత్తర ప్రథమ ప్రాకార మండపానికి చేరుకున్నారు. అక్కడ కృష్ణశిలతో చెక్కిన యాలీ పిల్లర్లు, సింహం తదితర విగ్రహాలను పరిశీలించి తన్మయత్వం పొందారు. అంతకుముందు సుందరీమణులకు కూచిపూడి, భరత నాట్యం, కోలాటం కళాకారులు సంప్రదాయంగా స్వాగతం ఫలికారు. కోలాట బృందంతో కలిసి సుందరీమణులు కోలాటం ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టెంపుల్.. సో బ్యూటిఫుల్
ఆలయంలో కలియదిరిగి పరిశీలించిన సుందరీమణులు.. టెంపుల్ సో బ్యూటీఫుల్ అని కితాబునిచ్చారు. అద్భుత కళాఖండం అంటూ కొనియాడారు. ఆలయ నిర్మాణ శైలిని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు వారికి వివరించారు. సుందరీమణుల పర్యటన సాయంత్రం 5గంటల నుంచి 7 గంటల వరకు రెండు గంటల పాటు కొనసాగింది.
అడ్డొస్తున్నాడని..
అడ్డొస్తున్నాడని..


