ఎల్‌ఆర్‌ఎస్‌ రాబడి రూ.39.18 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ రాబడి రూ.39.18 కోట్లు

May 6 2025 1:20 AM | Updated on May 6 2025 1:20 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ రాబడి రూ.39.18 కోట్లు

ఎల్‌ఆర్‌ఎస్‌ రాబడి రూ.39.18 కోట్లు

నల్లగొండ టూటౌన్‌ : ల్యాండ్‌ రెగ్యులరైజ్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) ద్వారా జిల్లాలోని మున్సిపాలిటీలకు దండీగా ఆదాయం సమకూరింది. గతంలో వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దాంతో జిల్లాలోని నీలగిరి, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్‌ మున్సిపాలిటీలకు ఫీజు రూపంలో రూ.39.18 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం ఏడు మున్సిపాలిటీల పరిధిలో 12,336 మంది దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకున్నారు. నందికొండ మున్సిపాలిటీలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేని విషయం తెలిసిందే. గత నెల ఏప్రిల్‌ నెలాఖరుతో ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ముగియగా మరో మూడు రోజులు ప్రభుత్వం పెంచడంతో ఈనెల 3వ తేదీతో ముగిసింది.

నీలగిరి మున్సిపాలిటీలో భారీగా..

జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా నీలగిరి మున్సిపాలిటీ ఆదాయంలో టాప్‌లో నిలిచింది. ఏడు మున్సిపాలిటీలకు కలిపి రూ.39.18 కోట్ల ఆదాయం రాగా.. నీలగిరి మున్సిపాలిటీకి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు రూ.20.87 కోట్లు వచ్చింది.

పెండింగ్‌ దరఖాస్తులు ఎక్కువే..

ఏడు మున్సిపాలిటీల్లో పెండింగ్‌ జాబితాలో ఉన్న దరఖాస్తులు భారీగానే ఉన్నా యి. అయితే ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 13,428 దరఖాస్తులు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. కొన్ని సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వం ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చేర్చింది. దీని కారణంగా వేలాది మంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేకపోవడం ఇతర కారణాలతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి.

మున్సిపాలిటీలకు సమకూరిన ఆదాయం (రూ.కోట్లలో..)

మున్సిపాలిటీ ఆదాయం

నీలగిరి 20.87

నకిరేకల్‌ 1.95

చిట్యాల 1.06

హాలియా 1.35

మిర్యాలగూడ 12.22

దేవరకొండ 0.82

చండూరు 0.91

ఫ మున్సిపాలిటీలకు భారీగా సమకూరిన ఆదాయం

ఫ రూ.20.87 కోట్లతో నీలగిరి టాప్‌

ఫ ముగిసిన ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు

రాయితీ లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవచ్చు

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ గడువు ముగిసింది. గడువు ముగిసినా రాయితీ లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవచ్చు. వెయ్యి రూపాయలు చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వారు ప్లాట్‌ డాక్యుమెంట్‌పై ఉన్న విలువలో 14 శాతం చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించకోవచ్చు.

– కృష్ణవేణి, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement