ఉపాధి సిబ్బంది వేతన వెతలు
ఉద్యోగుల వినతులు
సకాలంలో వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని గురువారం ఉపాధి హామీ పనుల పరిశీలనకు వచ్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనకు ఉద్యోగులంతా వినతిపత్రం సమర్పించారు. నాలుగు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నామని వేతనాలు ఇప్పించాలని కోరారు. అంతకుముందే కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి.. వేతనాలు ఇవ్వకపోతే విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
నల్లగొండ : ఉపాధి హామీ పథకం(ఈజీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. సంవత్సర కాలంగా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈజీఎస్ పనుల నిర్వహణకు సంబంధించి కరెంట్ బిల్లులు, నెట్ బిల్లులు, ఇతర ప్రింటింగ్ ఖర్చులతో పాటు ఎంపీడీఓ వాహనాల బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈజీఎస్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీఆర్‌డీఓకు కూడా వేతనం అందలేదు. డీఆర్‌డీఏలో సెర్ప్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ రెండు కళ్లు లాంటివని చెబుతున్న ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తూ ప్రతి నెల వేతనాలు ఇస్తోంది. కానీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం వేతనాలు సకాలంలో ఇవ్వడంల లేదు. ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని ఉపాధి హామీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేసిన పనుల్లో
6 శాతం అడ్మిన్ ఖర్చులకు..
ప్రతి సంవత్సరం ఉపాధి హామీలో చేపట్టిన పనులకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో 6 శాతం అడ్మిన్ ఖర్చు కింద కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ డబ్బుతోనే ఎంపీడీఓల వాహనాలు, నెట్ బిల్లు, కరెంట్ బిల్లుతో పాటు కార్యాలయ నిర్వహణ మండల, జిల్లా, గ్రామ స్థాయిలో ఈజీఎస్ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 2024–25లో ఉపాధి హామీ కింద జిల్లాలో పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేశారు. దాదాపు రూ.1200 కోట్ల వరకు ప్రతిపాదనలు పంపారు. అందులో 90 శాతం పైచిలుకు పనులు కూడా చేపట్టారు. అయితే ఇందులో ఆరు శాతం నిధులు ఈజేఎస్ నిర్వహణ, వేతనాల కోసం కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు వేతనాలు మాత్రం చెల్లించలేదు.
ఫ నాలుగు మాసాలుగా అందని జీతాలు
ఫ ఏడాదిగా విడుదలకాని వాహనాలు, కరెంట్, నెట్ బిల్లులు
ఫ వేతనాలివ్వాలని అధికారులకు వినతులు
ఉపాధి హామీ సిబ్బంది ఇలా..
ఏపీడీలు 3 ఈసీలు 28
ఏపీఓలు 27 పీల్డ్ అసిస్టెంట్లు 640
కంప్యూటర్ ఆపరేటర్లు 68


